Mirai movie ott release: యంగ్ హీరో తేజ సజ్జ ( Teja Sajja ) వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘హనుమాన్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తేజ, ఈ ఏడాది ‘మిరాయ్’ ( Mirai ) తో మరో ఘన విజయం నమోదు చేసుకున్నాడు. 60 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్‌లో 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నెల తిరిగేలోపే ఓటీటీలోకి వస్తోంది.
జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్, మంచు మనోజ్ విలన్‌గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
