స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ముందడుగు పడుతూ, పంచాయతీ రాజ్ శాఖ ( panchayat raj department telangana ) తాజాగా జిల్లా పరిషత్తు (జడ్పీ) స్థానాలకు రిజర్వేషన్లను ( Zilla Parishad Reservations ) అధికారికంగా ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు శనివారం జీవో జారీ చేశారు.
రాష్ట్రంలోని 31 జిల్లాలకు గాను కులగణన డేటాను ఆధారంగా చేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు.
ఎస్టీ రిజర్వేషన్ కింద ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఎంపికయ్యాయి. ఎస్సీ రిజర్వేషన్ కింద హన్మకొండ, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
బీసీ రిజర్వేషన్ కింద సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వికారాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు చేరాయి.
జనరల్ కేటగిరి కింద మిగిలిన పెద్దపల్లి, జగిత్యాల, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి.
ఈ అడుగుతో స్థానిక ఎన్నికల ప్రక్రియకు మరింత స్పష్టత వచ్చింది. తదుపరి దశలో మండల్ పరిషత్ స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
