Advertisement

OG Movie Review | పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్

Advertisement

they call him og review : సినిమాకు 2.75/5 రేటింగ్ ఇచ్చారు సమీక్షకులు.

Advertisement

1940 నుంచి 1993 వరకు సాగే కథ కొంత KGF, కొంత బాషా ఫీల్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ లుక్, ప్రెజెన్స్ సినిమాకు ప్లస్. కానీ డైలాగ్స్ తొలి 55 నిమిషాలు లేవు. ఇమ్రాన్ హష్మి (ఓమి) పాత్ర బాగుంది. సుదేవ్ నాయర్ (జిమ్మి), అర్జున్ దాస్ (అర్జున్) కూడా బాగా నటించారు. శ్రియా రెడ్డి గీత పాత్ర పవర్ ఫుల్ గా ఉంది. ప్రకాష్ రాజ్ పాత్రకు ఎమోషన్ లేదు. ప్రియాంక మోహన్ పాత్ర కేవలం ఔపచారికంగా మిగిలింది. సుజీత్ దర్శకత్వం స్టైలిష్ గా ఉంది. కానీ పాత్రలు చాలా ఎక్కువ, ఎమోషన్ లేకుండా పోయింది.

తమన్ సంగీతం సినిమాకు బూస్టర్. “సువ్వి సువ్వి” పాట, బీజీఎంలు బాగా పడ్డాయి. రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అద్భుతం. ఎడిటింగ్ బాగుంది. కానీ యాక్షన్ సీన్స్ ఒకే రకంగా అతిగా ఉన్నాయి. ప్రధమార్ధం బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ బలంగా ఉంది. ద్వితీయార్ధం నెమ్మదిగా, ఎమోషన్ లేకుండా సాగింది.

Advertisement

సినిమా చూసిన తర్వాత “ఓకే జీ” అనిపిస్తుంది తప్ప, అద్భుతం అని అనిపించదు.

Og movie pawan kalyan rating – 2.75/5

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement