September 23 bank holiday : మహారాజా హరి సింగ్ జయంతి సందర్భంగా జమ్మూ మరియు కాశ్మీర్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. మహారాజా హరి సింగ్ 1895 సెప్టెంబర్ 23న జన్మించారు. ఆయన జమ్మూ కాశ్మీర్ చివరి రాజుగా ప్రసిద్ధి చెందారు. ఆయన విద్య, సామాజిక సంస్కరణలు, మహిళా అభివృద్ధికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక ఆలోచనలతో చరిత్రలో నిలిచారు.ఈ సెలవు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో మాత్రమే అమలులో ఉంటుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు బ్యాంకింగ్ సేవలకు సాధారణంగా వెళ్లవచ్చు.
సెప్టెంబర్ లో ఇతర సెలవులు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 29న అగర్తల, గంగటోక్, కోల్కతాలో మహా సప్తమి / దుర్గా పూజ సందర్భంగా సెలవు.సెప్టెంబర్ 30న అగర్తల, భువనేశ్వర్, గువహతి, కోల్కతా, పాట్నా, రాంచీ సహా పలు నగరాల్లో మహా అష్టమి సెలవు ఉంటుంది. ప్రతి వారం సెలవులు: సెప్టెంబర్ 27 (నాలుగవ శనివారం), సెప్టెంబర్ 28 (ఆదివారం). బ్యాంకులు మూసివేయబడిన ప్రాంతాల్లో ఉన్న వారు ముందస్తుగా బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవడం మంచిది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
