Ap dsc 2025 appointment letters : రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త. గతంలో అనుకున్నట్టుగా వర్షాలు ఆటంకం కలిగించడంతో వాయిదా పడిన నియామక పత్రాల పంపిణీ ఇప్పుడు ఈ నెల 25న అమరావతిలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మొదటి ఫైల్‌పై సంతకం చేసి డీఎస్సీ ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్-జూలైలో పరీక్షలు నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు.
ఇప్పుడు, నియామక పత్రాలు అందుకున్న వెంటనే వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దసరా సెలవుల సమయంలోనే ఈ శిక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 2న ముగియనుండగా, అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అప్పటికి కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే, ఈ నెల 25న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. వై.సి.పి. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించకపోగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
