AP Rain Alert : ఈ అల్పపీడనం ఏపీ తీరాన్ని 27వ తేదీ సమీపంలో దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే గుంటూరు సమీపంలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి.
ఈ నెలాఖరు వరకు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. కానీ జూన్, జూలై నెలల్లో అంచనా వేసిన స్థాయిలో వర్షాలు లేవు. ఆగస్టు, సెప్టెంబర్‌లో మాత్రం రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు కురిస్తే నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ పరిస్థితికి అప్రమత్తమైంది. అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
