మన పత్రిక, వెబ్డెస్క్ : ముంబైలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రముఖ మాతుంగా గౌడ సారస్వత బ్రాహ్మణ (GSB) గణపతి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా పేరుపొందాడు. ఈ ఏడాది, ఈ విగ్రహాన్ని 267 కిలోల బంగారు ఆభరణాలు, 350 కిలోల వెండి సింహాసనంతో అలంకరించారు. 70 ఏళ్లుగా ఈ విగ్రహాన్ని GSB ట్రస్ట్ ప్రతిష్ఠిస్తోంది. ఈ గణపతికి రూ.444 కోట్ల భారీ బీమా చేయించారు. ఈ బీమాలో విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు, మరియు మండపంలో జరిగే కార్యక్రమాల భద్రత కవర్ అవుతాయి.
మాతుంగా గణపతి ప్రత్యేకత ఏమిటంటే, ఏటా భక్తుల నుంచి బంగారం, వెండి రూపంలో విరాళాలు పెరుగుతూనే ఉండటంతో ఈ గణపతి అత్యంత ధనికుడిగా నిలిచారు. వేలాది మంది భక్తులు ప్రతిరోజూ గణపతిని దర్శించుకుని, నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
