CM Review on Telangana Education Policy today | తెలంగాణ విద్యా విధానం (TEP) రూపకల్పనపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారు డా. కేశవరావు అధ్యక్షత వహిస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా (కన్వీనర్), టిజీహెక్ చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ జాతీయ విద్యా విధానం 2020 ను తెలంగాణ సందర్భానుసారంగా సవరించి పరిశీలించనుంది. కొత్త ఉద్యోగావకాశాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చడంపై దృష్టి పెట్టనుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ అంశాలపై కూడా సిఫార్సులు చేయనుంది.
పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి, నైపుణ్య విద్యా రంగాల్లో సమగ్ర సంస్కరణలు, పరిశోధన, పరిశ్రమలతో విద్యా రంగాన్ని అనుసంధానం చేయడంపై కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ నివేదికను 2025 అక్టోబర్ 30లోపు ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
