RK Kotha Paluku News : ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ (RK) తన ఆదివారం కాలమ్ “కొత్త పలుకు”లో అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో భారతీయ రాజకీయాలపై విమర్శ చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లలో ప్రజా ఆగ్రహంతో పాలకులు పడిపోయిన సంఘటనలను ప్రస్తావించి, అణచివేత ఉంటే ప్రతిఘటన తప్పదని గుర్తుచేశారు. అయితే ఈ విశ్లేషణ మధ్యలోనే ఆయన జగన్ మోహన్ రెడ్డిపై దృష్టి పెట్టారు. జగన్ కేసుల్లో ఇరుక్కున్నారని, వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు కేసు గురించి కూడా ప్రస్తావించారు.
ఈ రాసిన తీరు చర్చకు తావిస్తోంది. ఒకవైపు రాజకీయ వ్యవస్థ మొత్తం సర్వనాశనమైందని చెప్పి, మరోవైపు కేవలం జగన్, కేసీఆర్ మీద మాత్రమే దాడి చేయడం పక్షపాతంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుపై కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సహా పలు కేసుల్లో ఆయన పేరు నమోదైంది. జగన్ ప్రభుత్వం కాలంలో ఆయన కూడా జైలుకు వెళ్లారు. కానీ ఈ విషయాలను RK ప్రస్తావించలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గురించి కూడా ఏమీ రాయలేదు. ఇదంతా చూస్తే, ఆయన జర్నలిజం కంటే రాజకీయ కసితో నడుస్తోందని అనిపిస్తోంది.
భారతదేశంలో ప్రజలు వివేకంతో ఏ ఒక్క పార్టీకి ఏకపక్షంగా ఓటు వేయడం లేదు. అందుకే ప్రజా ఉద్యమాలు ఇంకా తలెత్తలేదు. ఈ విషయాన్ని చెప్పినా, చివరికి జగన్, కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడం “ఆవు వ్యాసం” లాగా అనిపిస్తుంది. “మాల్ మసాలా లేని వంటకం” లాగా ఉన్న ఈ కాలమ్, నిజాయితీ కంటే పక్షపాతాన్ని బయటపెడుతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
