september 14 rashi phalalu today : 2025 సెప్టెంబర్ 14, ఆదివారం – గ్రహాల మార్పులు కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ ఈ రోజు ప్రత్యేకం.
మేషం:
పాత పనులు విజయం సాధిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు సమస్యలు ఎదుర్కొన్నా తోడుగా ఉన్నవారి సహాయంతో పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు ఉండవచ్చు.
వృషభం:
ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కష్టానికి ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది.
మిథునం:
ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు విజయం సాధిస్తాయి. వ్యాపారులు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
కర్కాటకం:
ఉద్యోగులకు మేధస్సు పనికొస్తుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు అనుకూలం.
సింహం:
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెద్దల మద్దతు ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది.
కన్య:
కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అదనపు ఆదాయం సాధిస్తారు. శత్రువుల నుంచి దూరంగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి ధన సహాయం లభిస్తుంది.
తులా:
ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు జాగ్రత్త వహించాలి.
వృశ్చికం:
ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు అనుకూల రోజు. కుటుంబంతో సుఖంగా ఉంటారు.
ధనస్సు:
చెడు వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. అవకాశాలను వినియోగించుకోండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి.
మకరం:
పనులు పూర్తి చేయడానికి కష్టపడాలి. తోటి వారి మద్దతు ఉంటుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములతో వృద్ధి సాధిస్తారు.
కుంభం:
కొన్ని పనులు వాయిదా వేస్తారు. సరైన ప్రణాళికతో పూర్తి చేయాలి. వ్యాపారులు లాభాలు పొందుతారు.
మీనం:
ఏ పని చేసినా జాగ్రత్త అవసరం. శత్రువుల బెడద ఎక్కువ. వ్యాపారంలో నష్టం సాధ్యం. ఆర్థిక ఒత్తిడి ఉంటుంది.
ఈ రోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోండి – మీ ప్రణాళికలకు సరైన సమయం!
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
