Advertisement

TELANGANA JOBS | 40 వేల ఉద్యోగాలు త్వరలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సంచలన ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, వచ్చే ఆరు నెలల్లో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.

Advertisement

40000 jobs notifications in telangana 

రెండున్నరేళ్ల పాటు ప్రభుత్వ పాలనలో లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

Advertisement

ఈ సందర్భంగా సీఎం ఓయూలో పర్యటించారు. కొత్త హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దుందుభి, భీమ హాస్టళ్లకు ప్రారంభోత్సవం చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలను మించేలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Advertisement

ఉస్మానియా చరిత్రలో మొట్టమొదటిసారిగా దళిత వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరాన్ని నియమించినట్లు పేర్కొన్నారు.

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని లక్ష్యం ప్రకటించారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement