ప్రసిద్ధ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన నివాసం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ ఒరిజినల్ పెయింటింగ్‌ను స్వీకరించారు. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఈ చిత్రాన్ని అందజేశారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, జీవన విధాన ప్రతిబింబాలకు తోట వైకుంఠం అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందారు.
ఈ ప్రత్యేక చిత్రంలో వెంకటేశ్వరస్వామి, అమ్మవారితో పాటు సాంప్రదాయ గ్రామీణ నేపథ్యం, భక్తుల పూజలు మరియు ముగ్గు డిజైన్లు ఉన్నాయి. తోట వైకుంఠం రూపొందించిన ఈ కళాఖండాన్ని అందుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
