నటి సమంత కాన్పు సమయానికి సంబంధించిన కొన్ని వివరాలను గాయని, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శోభా రాజు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజ్ నిడిమోరు మేనత్త అయిన శోభా రాజు మాట్లాడుతూ, డెలివరీకి ముందు చేసిన స్కాన్‌లో చిన్న సమస్యను వైద్యులు గుర్తించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని తెలిపారు.
పాపాయి మెడకు బొడ్డుతాడు చుట్టుకోవడంతో కదలికలపై ఆందోళన వ్యక్తమైందని, ఆ సమయంలో తమ కుటుంబం ప్రార్థనలు చేసిందని శోభా రాజు చెప్పారు. వైద్యులు సి-సెక్షన్ సూచించినట్లు రాజ్ సమాచారం అందించినప్పటికీ, చివరికి సమంత సుఖప్రసవంలో బాబుకు జన్మనిచ్చారని ఆమె తెలిపారు. నవంబర్ 19న జన్మించిన బాబుకు దేవ్ నిడిమోరు అని పేరు పెట్టారని, ప్రస్తుతం సమంత, బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
