Advertisement

ఆర్థిక ఇబ్బందులతో లవర్ వదిలేసింది: విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ తాను సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న ప్రారంభ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఇఎన్ఇ రిపీట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.

తన 17వ ఏటనే సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించానని విశ్వక్ సేన్ తెలిపారు. ఆరంభంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు డబ్బులు లేకపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్ కూడా వదిలివెళ్లిపోయిందని చెప్పారు. అంతేకాకుండా ఒక సినిమాలో మొదట హీరోగా అవకాశం ఇస్తామని చెప్పి, ఆ తర్వాత క్రమంగా నాలుగో హీరోగా మార్చి, చివరకు తొలగించారని వివరించారు. ఆ చేదు అనుభవాల తర్వాతే తాను ఫలక్‌నుమా దాస్ చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు.

Advertisement
Advertisement