Advertisement

అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రంలో గోవిందా?

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘రాకా’లో బాలీవుడ్ నటుడు గోవిందా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే, గోవిందాకిది దక్షణాది సినీ పరిశ్రమలో అరంగేట్రం అవుతుంది. అయితే ఈ ప్రచారంపై నటుడి నుంచి గానీ, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సన్ పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాను ఇటీవలే ‘రాకా’గా ప్రకటించారు. సెప్టెంబర్ 2026లో ఒకేసారి 37 మంది కళాకారులతో రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ చిత్రీకరించి ఈ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. చిత్ర విశేషాలకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను డిసెంబర్ 2026లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Advertisement
Advertisement