Advertisement

ఎన్టీఆర్ డ్రాగన్ టైటిల్ వెనుక అసలు కథ చెప్పిన అయాన్ ముఖర్జీ

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా టైటిల్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ టైటిల్ నిజానికి రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి మొదట అనుకున్న వర్కింగ్ టైటిల్ అని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ పరిమాణం పెరగడంతో దానికి ‘బ్రహ్మాస్త్ర’ అని పేరు మార్చారని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తమ సినిమా కోసం తగిన టైటిల్ కోసం చూస్తున్న సమయంలో, తాను మరియూ నిర్మాత కరణ్ జోహార్ కలిసి ఈ ‘డ్రాగన్’ టైటిల్‌ను వారి టీమ్‌కు ఇచ్చినట్లు అయాన్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Advertisement
Advertisement