Advertisement

ఒకే రోజు సినిమాలతో మమ్ముట్టి, దుల్కర్ సందడి

సినీ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ తమ కొత్త చిత్రాలతో నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మమ్ముట్టి నటించిన OM మరియు దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార చిత్రాలు పలు భాషల్లో ఒకే రోజు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి.

పరస్పర ప్రచారంలో తండ్రీకొడుకులు

ఈ చిత్రాల విడుదల నేపథ్యంలో తండ్రీకొడుకులిద్దరూ ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మమ్ముట్టి తెలుగులో మాట్లాడుతూ దుల్కర్ సినిమా ‘ఆకాశంలో ఒక తార’ను ప్రమోట్ చేయగా, దుల్కర్ సల్మాన్ తమిళంలో మాట్లాడుతూ తన తండ్రి చిత్రం ‘OM’ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. విభిన్న భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ ప్రచార వీడియో సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది.

Advertisement
Advertisement