Advertisement

సైబర్ మోసంలో రూ. 4.14 లక్షలు కోల్పోయిన నటి అనిత చౌదరి

తెలుగు నటి అనిత చౌదరి ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ మోసంలో చిక్కుకుని రూ. 4.14 లక్షలు కోల్పోయారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉన్న తన కుమారుడి జన్మదిన వేడుకలకు వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా ఈ సంఘటన జరిగింది.

టికెట్ వివరాల కోసం సైట్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు అనిత చౌదరి కాల్ చేయగా, ఒక వ్యక్తి తక్కువ ధరకే రౌండ్ ట్రిప్ టికెట్లు ఇస్తానని నమ్మించాడు. బుకింగ్ పూర్తి చేయడానికి డెబిట్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని చెప్పాలని కోరాడు. అతడి మాటలు నమ్మి వివరాలు పంచుకోవడంతో ఖాతా నుండి రూ. 4,14,180 విత్‌డ్రా అయ్యాయి. అయితే టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement