వ్యాపార రంగంలో ఎదురైన పరాజయాలు తనకు ఎన్నో ముఖ్యమైన విషయాలను నేర్పాయని నటి సమంత రూత్ ప్రభు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తను చేపట్టిన కొన్ని వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సఫలం కాలేదని చెప్పారు. విజయాల కంటే వైఫల్యాలే తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని, ఆ అనుభవాలు జీవితంలో ఎదగడానికి తోడ్పడ్డాయని వివరించారు.
వ్యాపారాల్లో తీసుకునే ప్రతీ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని, కానీ ఆ అనుభవాల ద్వారా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని సమంత చెప్పారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి చాలామంది మహిళలు ముందుకు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దాదాపు పది కంపెనీలలో పెట్టుబడులు పెట్టానని, అందులో ఎక్కువ భాగం మహిళల నాయకత్వంలో నడుస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆమె వెల్లడించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
