Advertisement

ప్రభుత్వ యాడ్‌ కోసం కెమెరా ముందుకు విజయ్?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక ప్రభుత్వ ప్రకటన చిత్రం ద్వారా తిరిగి కెమెరా ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది. సినీ రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, ఈ ప్రకటన కోసం రెండు రోజుల షూటింగ్ సమయాన్ని కేటాయించినట్లు సమాచారం. ఈ ప్రచార చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ప్రచార చిత్రంపై ఆసక్తి

గతంలో ‘జననాయగన్’ సినిమానే తన చివరి చిత్రమని విజయ్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఇప్పుడు ఒక ప్రభుత్వ యాడ్ కోసం ఆయన మళ్లీ నటించనున్నారనే వార్త అభిమానుల్లో, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

రాష్ట్ర ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ యాడ్ షూటింగ్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన బడ్జెట్, కాన్సెప్ట్ మరియు ఇతర వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది వాణిజ్యపరమైన సినిమా కాదని, కేవలం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమని తెలుస్తోంది.

Advertisement