Advertisement

‘కింగ్’ మూవీ వివాదం: దీపిక కాషాయ దుస్తులపై నిరసనలు

షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే కాంబినేషన్‌లో వస్తున్న ‘కింగ్’ సినిమాలోని ‘తు మిల్ జాయే’ పాటపై కొత్త వివాదం మొదలైంది. ఈ పాటలో దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించడంపై బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దుస్తులు హిందూ మత భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

దుస్తుల రంగు మార్చాలని డిమాండ్

చిత్రనిర్మాతలు వెంటనే దీపిక ధరించిన దుస్తుల రంగును మార్చాలని ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి డిమాండ్ చేశారు. ఒకవేళ మార్పులు చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ వివాదంపై షారుఖ్ ఖాన్ లేదా దీపిక పదుకొణే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Advertisement

గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనే వచ్చిన ‘పఠాన్’ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో కూడా దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రం ‘కింగ్’ 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement