Advertisement

తొలిరోజే రూ. 127 కోట్ల వసూళ్ సాధించిన రామాయణ చిత్రం

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కీలక పాత్రల్లో నటించిన రామాయణ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 127 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. హిందీ మార్కెట్ నుంచే ఈ సినిమాకు రూ. 47.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

భాషల వారీగా వసూళ్ల వివరాలు

ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదయ్యాయి. కన్నడ వెర్షన్ ద్వారా దాదాపు రూ. 7.25 కోట్లు, తెలుగు వెర్షన్ ద్వారా రూ. 6 కోట్లు వచ్చాయి. అలాగే తమిళ వెర్షన్ రూ. 2.60 కోట్లు, మలయాళం వెర్షన్ మరో రూ. 1.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రూ. 2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి మున్ముందు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement