ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి కుమారుడు, సంగీత దర్శకుడు కాల భైరవ నటి కావ్య కళ్యాణ్‌రామ్‌ను వచ్చే నెలలో వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వేడుకలు కావ్య ఇంట్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వధువు తండ్రి సోషల్ మీడియాలో ఈ సంబరాలకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
పెద్దల అంగీకారంతో ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 31న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో వీరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కావ్య కుటుంబ సభ్యుల ఇంట్లో జరిగిన వేడుకకు కీరవాణి కుటుంబంతో పాటు ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి హాజరై జంటను ఆశీర్వదించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
