Advertisement

దివాళీ కానుకగా ఉద్యోగులకు ఐఫోన్ 16 ఇచ్చిన ఢిల్లీ సంస్థ

న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు దివాళీ పండుగ కానుకగా ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేసింది. సాధారణంగా పండుగ సమయంలో తీపి పదార్థాలు లేదా గిఫ్ట్ హాంపర్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుండగా, ఈ సంస్థ ఏకంగా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

కంపెనీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పండుగ వేడుకలకు సంబంధించిన 15 సెకన్ల వీడియోను పంచుకుంది. అందులో ఉద్యోగుల డెస్క్‌లపై వేర్వేరు రంగుల్లో ఉన్న ఐఫోన్ 16 ఫోన్‌లను అలంకరించి ఉంచారు. బహుమతులు అందుకున్న అనంతరం ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

Advertisement

సామాజిక మాధ్యమాల్లో వైర్‌ల్ కామెంట్లు

ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా వ్యాపించడంతో అనేకమంది వినియోగదారులు స్పందించారు. ఇది కృత్రిమ మేధతో తయారుచేసిన వీడియో అయి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేయగా, కంపెనీ ఆ వ్యాఖ్యలను ఖండించింది. మరికొందరు తమ ఉద్యోగ అవకాశాల గురించి విచారిస్తూ సరదాగా కామెంట్లు చేశారు.

Advertisement