Advertisement

షారుఖ్ ఖాన్ పుట్టినరోజున ‘కింగ్’ సినిమా తొలి పాట విడుదల

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘కింగ్’ నుంచి మొదటి పాట విడుదల అయింది. ‘తు మిల్ జాయే’ పేరుతో వచ్చిన ఈ పాటను అర్ధరాత్రి వేళ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొణె కనిపించారు. రోమాన్స్, డ్రామాతో పాటు యాక్షన్ దృశ్యాల సమ్మేళనంగా ఈ సాంగ్ అలరిస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో సంగీత కలయిక

ఈ పాటలో గాయకుడు అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చీ అలరించగా, పాప్ స్టార్ ఎడ్ షీరన్ ఇంగ్లీష్ ర్యాప్ అందించారు. సచిన్-జిగర్ ద్వయం ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ ట్రాక్‌కు సంగీతం అందించగా, కుమార్ సాహిత్యం రాశారు. ఎడ్ షీరన్ స్వయంగా ర్యాప్ విభాగాన్ని రచించడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు షారుఖ్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు.

Advertisement
Advertisement