Advertisement

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

బిజెపి చేపడుతున్న పాదయాత్ర కారణంగా సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ పాదయాత్ర బిజెఆర్ విగ్రహం నుంచి ఎమ్‌జె మార్కెట్ వరకు సాగనుంది. ప్రదర్శన సాగే సమయాన్ని బట్టి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.

కీలక జంక్షన్లలో వాహనాల మళ్లింపు

ఎఆర్ పెట్రోల్ పంప్ నుంచి బిజెఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు. లిబర్టీ, బషీర్‌బాగ్, గంగూఫౌండ్రీ, ఎమ్‌జె మార్కెట్, అఫ్జల్‌గంజ్ వంటి జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. రవీంద్ర భారతి నుంచి వచ్చే ఆర్‌టిసి బస్సులను నాంపల్లి వైపు, ఎమ్‌జె మార్కెట్ నుంచి జిపిఓ వైపు వెళ్లే బస్సులను తాజ్ ఐలాండ్ వైపు మళ్లిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులు తగిన సమయం చూసుకుని బయలుదేరాలని పోలీసులు సూచించారు.

Advertisement
Advertisement