Advertisement

హాలీవుడ్ హారర్ సినిమా కోసం మళ్లీ జోడీ కట్టిన వరుణ్, కృతి

బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, కృతి సనన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేశారు. హాలీవుడ్ హారర్ సినిమా Obsession హిందీ వర్షన్ కోసం వీరిద్దరూ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లోని ది పీకాక్ హబ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

అన్ కట్ వర్షన్‌గా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

కరీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని అన్ కట్ వర్షన్‌గా ఇంగ్లీష్, హిందీ భాషల్లో భారతీయ వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. తన సహోద్యోగిని ప్రేమలో పడేసేందుకు ఒక యువకుడు చేసే ప్రయత్నం, దాని వల్ల ఎదురయ్యే భయానక పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.

Advertisement
Advertisement