Advertisement

వియత్నాం ఘటనతో ‘కల్ట్’ కథను పూర్తిచేశా: విశ్వక్ సేన్

తాను దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ‘కల్ట్’ సినిమా కథ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని నటుడు విశ్వక్ సేన్ వెల్లడించారు. ఓ ప్రైవేట్ పార్టీలో ఆడే గేమ్ ప్రమాదకరంగా మారి ప్రాణాలమీదికి వచ్చే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం ప్రారంభించిన తర్వాత రెండో భాగాన్ని పూర్తి చేయడంలో రెండేళ్ల పాటు ఇబ్బంది ఎదురైందని ఆయన పేర్కొన్నారు.

వియత్నాం ఘటనతో దొరికిన ముగింపు

కథకు సరైన ముగింపు దొరక్క ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన సమయంలో, వియత్నాంలో జరిగిన ఒక సంఘటన గురించి తన స్నేహితుడు చెప్పినట్లు విశ్వక్ సేన్ తెలిపారు. ఆ ఘటన ఆధారంగానే నిలిచిపోయిన రెండో భాగం కథను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేశానని ఆయన చెప్పారు. తారక్ సినిమాస్, వాన్మయే క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

Advertisement
Advertisement