Advertisement

రష్మికపై ప్రేమను చాటుకున్న విజయ్ దేవరకొండ

నటి రష్మిక మందన్నపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక తన భార్య మాత్రమే కాకుండా ఉత్తమ స్నేహితురాలని, ఆమె తన జీవితంలో ఒక అందమైన భాగమని ఆయన పేర్కొన్నారు. తమద్దరం కలిసి చాలా సంతోషంగా ఉన్నామని, ఆమెను ఎంచుకోవడం సరైన నిర్ణయమని విజయ్ తెలిపారు.

ఇటీవల తమ బంధంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్, ప్రచారాలపై ఇద్దరూ స్పందించారు. తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రష్మిక అంతకుముందే ఒక పోస్ట్‌లో కోరారు. ప్రపంచం మొత్తం తమకు వ్యతిరేకంగా మారినా ఇద్దరం కలిసి నిలబడతామని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. తమ బంధాన్ని గౌరవిస్తూ మద్దతు తెలుపుతున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement