Advertisement

అక్టోబర్ 30న వెంకటేష్ ‘ఏకే47’ సినిమా విడుదల

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (ఏకే47) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 30, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ కొత్త విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్‌లో నటుడు-దర్శకుడిగా వస్తున్న మొదటి చిత్రం ఇది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్ 2న, ఆ తర్వాత అక్టోబర్ 9న విడుదల చేయాలని భావించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. ఫైనల్‌గా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి కూర్పు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement