వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా పలుమార్లు వాయిదా పడిన తర్వాత, అక్టోబర్ 30న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అక్టోబర్ 2 మరియు అక్టోబర్ 9 తేదీల్లో ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ ఆ తేదీల్లో విడుదల కాలేదు. దీంతో ఈ కొత్త తేదీపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ
జైలర్ 2 విజయోత్సవ సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఊటీలో షూటింగ్లో ఉన్న వెంకటేష్ తిరిగి వచ్చాక, ట్రైలర్తో పాటు కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 21 లేదా 22 తేదీల్లో ఈ ప్రకటన రావచ్చునని భావిస్తున్నారు. కాగా, అక్టోబర్ 30న విశ్వక్ సేన్ సినిమాతో పాటు నాగార్జున సమర్పణలో వస్తున్న ఇట్లు అర్జున్ చిత్రాలు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
