Advertisement

హైదరాబాద్‌లో వీగన్ ఆహారంపై పెటా ఇండియా అవగాహన

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ వద్ద పెటా ఇండియా శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆహార ఎంపికలు, జంతు సంక్షేమం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

జంతువుల దుస్తుల్లో ప్రచారం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు పులి, జింక, జిరాఫీ వంటి జంతువుల దుస్తులు ధరించి ప్లాకార్డులతో నినాదాలు చేశారు. మాంసాహారం వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయని, అందువల్ల వీగన్ ఆహారాన్ని ఎంచుకోవాలని కోరారు. జంతువులను కేవలం ఆహారం కోసం చంపడం సరికాదని, ప్రతి ఒక్కరూ దయతో వ్యవహరిస్తూ మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement
Advertisement