Advertisement

బిగ్‌బాస్ 10 వారం 6 నామినేషన్లలో 8 మంది

మన పత్రిక: బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వాగ్వాదాల నడుమ ముగిసింది. సోమవారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో రెండవ రోజు కంటెస్టెంట్ల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు. ఝాన్సీ, వంశీ, అమన్, వర్షిణి, రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముకేష్ గౌడ, రోహిత్ నామినేట్ అయిన వారిలో ఉన్నారు.

ఈ ప్రక్రియలో కంటెస్టెంట్లు చెప్పిన కారణాలపై ఒకరికొకరు తీవ్రంగా విభేదించారు. ముకేష్ గౌడ రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేయగా, అంతకుముందు దేబ్‌జాని షాలినిని నామినేట్ చేశారు. నామినేషన్ల సమయంలో వంశీ, షాలిని మధ్య చర్చ జరిగింది. ఆ తర్వాత త్రిగుణ్ రోహిత్‌ను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. త్రిగుణ్ రోహిత్ గ్రూప్‌ను ఉద్దేశించి ‘రొట్టా గ్యాంగ్’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.

Advertisement

భౌతిక దాడి వరకు వెళ్లిన వివాదం

నామినేషన్ల సమయంలో రోహిత్, వంశీ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దాదాపు భౌతిక దాడి వరకు వెళ్లేలా పరిస్థితులు మారాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బిగ్‌బాస్ ‘దశావతారం’ థీమ్‌లో భాగంగా ‘రోడ్ బ్లాక్’ అనే కొత్త టాస్క్‌ను ఇచ్చారు. ఈ టాస్క్ సమయంలో నరేష్, రోహిత్ మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. రోహిత్ ఆటతీరు బలహీనంగా ఉందంటూ నరేష్ విమర్శలు చేశారు. ఈ చర్చ ముగిసేసరికి చరణ్ ప్రస్తావన కూడా వచ్చింది. ఎనిమిది మంది నామినేట్ కావడంతో ఈ వారం తక్కువ ఓట్లు సాధించి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement