మన పత్రిక, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో లైన్ల మరమ్మతులు, విద్యుత్ టవర్ల ఏర్పాటు మరియు మార్పిడి పనుల నిమిత్తం అక్టోబరు 13న విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. 11 కేవీ లైన్ల నిర్వహణ పనుల వల్ల ఆయా ప్రాంతాల్లో నిర్దేశిత వేళల్లో కరెంట్ ఉండదని తెలిపారు.
వసంతనగర్ సెక్షన్ పరిధిలోని కేపీహెచ్‌బీ ఫేజ్ 6, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో 11 కేవీ లైన్ ఏబీ స్విచ్ పనుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.
పీర్జాదిగూడ పరిధిలో టవర్ల ఏర్పాటు, ఫీడర్ సంబంధిత పనుల వల్ల పద్మావతి కాలనీ, అమసాని వెంకట్ రెడ్డి కాలనీ, ఆర్ఎన్ఎస్ కాలనీ, బీఎల్ నగర్, అంజయ్య ఎన్క్లేవ్, టెలిఫోన్ కాలనీ ఫేజ్ 2, పిఎన్ఆర్ కాలనీ, రెడ్డిస్ కాలనీ, భవానీ కాలనీ, సుభోదయ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ, అంగపురి కాలనీ, భీమ్ రెడ్డి కాలనీ, ఎన్ఐఎన్ కాలనీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదు. అంతేకాకుండా ఫీడర్ పనుల వల్ల మణికంఠ నగర్, వివేకానంద నగర్, శ్రీ లక్ష్మి నగర్, లెక్చరర్స్ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీమ్ రెడ్డి కాలనీ, అశోక్ నగర్, గ్రీన్ సిటీ కాలనీ, అంగపురి కాలనీల్లో ఉదయం 11 నుంచి 11:15 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:45 నుంచి 3 గంటల వరకు స్వల్ప అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఉప్పల్ లోని చిలుకానగర్ పరిధిలో సూర్య హిల్స్, నార్త్ బాలాజీ హిల్స్ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ కట్ కానుంది. సాయి భవానీ నగర్, గాయత్రి హిల్స్ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తారు. పనులు పూర్తయిన తర్వాత విద్యుత్ సరఫరా యథావిధిగా పునరుద్ధరిస్తామని, స్థానిక విద్యుత్ కేంద్రాల ద్వారా హెచ్చరికలను గమనించి ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
