Advertisement

రణబలి చిత్రంపైనే విజయ్ దేవరకొండ ఆశలు

మన పత్రిక: కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘రణబలి’ షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి భారతదేశం, మద్రాస్ కరువు ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉండనుంది. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించిన చిత్రబృందం, త్వరలోనే థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

2018లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాలతో విజయ్ దేవరకొండ భారీ విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత విడుదలైన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ చిత్రాలు థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘రణబలి’ సినిమాతో ఆయన మళ్లీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తారా లేదా అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement