Advertisement

లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం?

మన పత్రిక: దర్శకుడు లోకేష్ కనగరాజ్ సారథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రానున్న కొత్త చిత్రం ‘AA23’ గురించి చిత్ర పరిశ్రమలో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ మూడు పాత్రల్లో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను 2026లో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కలిసి ‘రాకా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే ఆయన లోకేష్ కనగరాజ్ సినిమా చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉంది. సినిమా అధికారిక ప్రారంభోత్సవం తర్వాతే అల్లు అర్జున్ పోషించే పాత్రలు, కథాంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement