Advertisement

తాతయ్య కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేయించిన ఉపాసన

మన పత్రిక: అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన విశేషాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సెప్టెంబర్ 21న తాను సుందరకాండ పారాయణం పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. తన జీవితంలో ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్న ఘట్టమని ఆమె పేర్కొన్నారు.

సుందరకాండ పారాయణం పూర్తయిన రోజే అయోధ్య రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్, ఉపాసన కోరిన ప్రత్యేక రాముడి విగ్రహ తయారీని పూర్తి చేశారు. తన 93 ఏళ్ల తాతయ్య కోసం ఈ విగ్రహాన్ని తయారు చేయించాలని ఏడాది క్రితమే నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తాతయ్య సుందరకాండ భక్తి తనలో స్ఫూర్తి నింపిందని, తాను పారాయణం ముగించిన రోజే విగ్రహ తయారీ పూర్తికావడం దైవానుగ్రహంగా భావిస్తున్నానని ఉపాసన చెప్పారు.

Advertisement
Advertisement