Advertisement

ది పారడైజ్ జడ లుక్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు

మన పత్రిక: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది పారడైజ్’ చిత్రంలో తన ప్రత్యేకమైన జడ హెయిర్‌స్టైల్ వెనుక ఉన్న కారణాన్ని హీరో నాని వెల్లడించారు. సాధారణంగా ఎవరైనా అడిగారనే కారణంతో తాను ఇటువంటి రూపానికి అంగీకరించనని, అయితే ఈ కథకు మరియు తన పాత్ర స్వభావానికి ఆ హెయిర్‌స్టైల్ ఎంతో అవసరమనిపించడంతోనే రిస్క్ తీసుకున్నానని తెలిపారు.

సోషల్ మీడియా కాలంలో ఇటువంటి ప్రయోగాలు చేయడం పెద్ద సవాలని నాని పేర్కొన్నారు. చిన్న పొరపాటు జరిగినా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కథలో ప్రాధాన్యం దృష్ట్యా ముందడుగు వేశానని చెప్పారు. ‘ఆయా షేర్’ పాట విడుదలైన తర్వాత అభిమానులు ఈ లుక్‌ను అనుకరిస్తున్నారని, రీల్స్ చేయడం కోసం ఇలాంటి హెయిర్ బ్రెయిడ్స్ కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పాట వచ్చిన తర్వాత లక్షకు పైగా ఇటువంటి హెయిర్ బ్రెయిడ్స్ అమ్ముడైనట్లు తన బృందం తెలిపినట్లు నాని వెల్లడించారు.

Advertisement
Advertisement