Advertisement

రాకా చిత్రం నుంచి 37 పోస్టర్ విడద‌ల‌

మన పత్రిక: అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘రాకా’ సినిమా నుంచి మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కేవలం “37” అనే నంబర్‌ను మాత్రమే చూపిస్తూ, త్వరలోనే ఒక పెద్ద అప్‌డేట్ రాబోతోందనే సంకేతాన్ని ఇచ్చారు.

ఈ పోస్టర్ చూసిన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పలు రకాల అంచనాలను వేస్తున్నారు. సెప్టెంబర్ 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు కావడం, 3ను 7తో గుణిస్తే 21 వస్తుండటంతో ఆ రోజే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Advertisement

సన్ పిక్చర్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement