Advertisement

20 ఏళ్ల పెళ్లి బంధం వేళ సూర్య, జ్యోతిక రీవెడ్డింగ్

మన పత్రిక: తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు సూర్య, జ్యోతిక దంపతులు తమ 20 ఏళ్ల వివాహ బంధాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రీవెడ్డింగ్ వేడుక చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించి తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు.

ఈ ప్రత్యేక సందర్భంలో సూర్య, జ్యోతిక ఇద్దరూ తెలుపు రంగు దుస్తులు ధరించారు. జ్యోతిక తెల్లటి వెడ్డింగ్ గౌనులో కనిపించగా, సూర్య వైట్ టక్సేడో ధరించారు. వీరి పిల్లలు దియా, దేవ్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

Advertisement

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో పంచుకుంటూ “ది సీక్వెల్” అని పేర్కొన్నారు. గత 20 ఏళ్ల ప్రయాణం ప్రేమ, అవగాహన, సర్దుబాట్లు మరియు త్యాగాలతో నిండివుందని ఆమె వెల్లడించారు.

సూర్య, జ్యోతిక జంట మొదటగా 1999లో వచ్చిన ‘పూవెల్లం కేట్టుప్పార్’ చిత్రం షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరూ, 2006 సెప్టెంబరు 11న వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట రీవెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకట్టుకుంటోంది.

Advertisement