సినిమా: టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, గ్లామరస్ బ్యూటీ ఈషా రెబ్బా రిలేషన్షిప్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రంలో తొలిసారిగా కలిసి నటించినప్పటి నుంచి వీరు ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగలేదు.
తాజాగా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చేలా వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి పండగ పూజ చేస్తున్న ప్రత్యేక ఫొటోను తరుణ్ భాస్కర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడం టాలీవుడ్లో చర్చకు దారితీసింది. దీనిపై మంచు లక్ష్మితో పాటు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ఫొటో ద్వారా వీరిద్దరూ తమ బంధంపై పరోక్షంగా హింట్ ఇచ్చేశారని, త్వరలోనే పెళ్లి ప్రకటన చేస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తరుణ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ వార్తలపై ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
