Advertisement

తెలంగాణలో నేడు భారీ వానలు, హైదరాబాద్‌లోనూ వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.

ఇక భాగ్యనగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మరోవైపు, తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం అప్రమత్తం చేస్తూ.. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
Advertisement