Advertisement

విశాఖలో ఆకట్టుకుంటున్న ‘వ్యాయామ గణపతి’

వినాయక చవితి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో వినూత్న ఆలోచనతో రూపొందించిన ఓ ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాఖలోని గాజువాక బీహెచ్‌పీవీ కూడలి సమీపంలో జిమ్ నిర్వాహకుడు బర్ల రవికుమార్ యాదవ్ ‘వ్యాయామ గణపతి’ని ఏర్పాటు చేసి భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.

సాధారణంగా మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ, ఇక్కడ పూర్తిగా వ్యాయామ సామగ్రితో గణనాథుడిని తీర్చిదిద్దడం విశేషం. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించేందుకు ఈ ప్రత్యేక ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. ఈ వినూత్న గణనాథుడిని తిలకించేందుకు, ఆయనను దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు, యువకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Advertisement
Advertisement