Advertisement

రామాయణ సినిమా నుంచి రణ్‌బీర్, సాయిపల్లవి ఫస్ట్ లుక్ విడుదల

మన పత్రిక: నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ నుంచి ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా కనిపిస్తున్న సాయిపల్లవిల ‘సియా-రామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ‘జై జై రామ్’ అనే పాటతో సంగీత ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషాల్ ఆలపించారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

Advertisement

విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ముందస్తు ప్రణాళికతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని 2026 దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement