Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లోకి రవితేజ ‘ఇరుముడి’

సినిమా: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ చిత్రం ‘ఇరుముడి’. ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా అలరించారు. మద్యానికి బానిసైన ఓ తండ్రి తన కూతురి కోసం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement