Advertisement

రూ.200 కోట్లు క్రాస్ చేసిన ‘హనుమాన్ అంశ్’

సినిమా: ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో అత్యంత సాధారణంగా తెరకెక్కిన ఈ చిత్రం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా రిలీజైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.205.73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అరుదైన మైలురాయిని చేరుకుంది.

ఇప్పటికే విదేశాల్లో విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ ఈ నెల18 నుంచి థియేటర్లలో అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఇక్కడ విడుదలయ్యాక కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టిస్తోన్న ఈ చిత్రం టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement