Advertisement

సూర్య ‘సీన్’ టైటిల్ ఖరారు.. పవర్ ఫుల్ టీజర్ రిలీజ్

సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘Suriya 47’. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి ‘సీన్‌ (Scene)’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన పవర్‌ఫుల్ టైటిల్ టీజర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.

టీజర్‌లో షార్ట్, టీ షర్ట్‌లో సూర్య నయా మేకోవర్‌లో కనిపిస్తూ స్టైలిష్ ఎంట్రీతో అదరగొట్టారు. పోలీసాఫీసర్‌ భుజంపై చేయి వేసి జైలులో ఖైదీల మధ్య నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్న సీన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రంలో సూర్య పూర్తి భిన్నమైన యాంగిల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నూతన చిత్రంలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement