Advertisement

AP మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో 913 ఆశావర్కర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తాజాగా మరో 913 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళలు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందినవారై ఉండాలి. టెన్త్ ఉత్తీర్ణతతో పాటు 25 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న స్థానిక మహిళలకు ఈ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. ఎంపికైన ఆశావర్కర్లకు ప్రతినెలా రూ.10,000 చొప్పున గౌరవ వేతనం అందజేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Advertisement
Advertisement