Advertisement

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. SUICIDE NOTE

హైదరాబాద్: “అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తాను తప్పు చేశానని, దానికి చావే శిక్ష అని లేఖలో పేర్కొన్న ఆమె.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను సకాలంలో కాపాడారు.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈశ్వర్ సాయి అనే వ్యక్తి మోసం చేశాడని మాధురి ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడిని అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనతో తన పరువు పోయిందని, సమాజంలో తీవ్రంగా చెడు పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంపై విరక్తి చెంది ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement