Advertisement

BIG BREAKING: డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి నటుడు ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.

పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతూ ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడారు. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా తన పరువుకు భంగం కలిగిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మాధురి రాథోడ్ ఆరోపించారు.

Advertisement
Advertisement